హైదరాబాద్, సిటీటైమ్స్: నగరంలోని డాక్టర్ వైఎస్ఆర్ నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టూరిజం అండ్ హాస్పిటలిటీలో పనిచేస్తున్న డాక్టర్ వి.నరేంద్ర కుమార్ డాక్టరేట్ పట్టాను పొందారు. జెఎన్టియు హైదరాబాద్‌లో హ్యుమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ ఇన్ ఫైవ్ స్టార్ హోటల్స్ ఇన్ హైదరాబాద్-ఎంప్రికల్ స్టడీ అనే అంశంపై ఆయన పరిశోధనలను చేశారు. డిసెంబరు 2021లో తన పరిశోధన పత్రాన్ని ప్రచురించారు. అందులో ఉత్తీర్ణత సాధించడంతో జెఎన్టియు డాక్టరేట్ పట్టాను నరేంద్రకుమార్‌కు అందజేసింది.
