Breaking News

నేటి నుంచే బూస్టర్ డోస్

 

  • రాష్ట్రవ్యాప్తంగా నేటి నుంచి బూస్టర్ డోసు వ్యాక్సినేషన్ ప్రక్రియ ప్రారంభం..
  • మొదటి విడతలో ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు, 60 సంవత్సరాల పైవారికి..

హైదరాబాద్, సిటీటైమ్స్: దేశంలో కరోనా థర్డ్‌ వేవ్‌ ప్రారంభమైంది. గత కొన్ని రోజులుగా ఒమైక్రాన్‌ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. రాష్ట్రంలో సామాజిక వ్యాప్తి వచ్చేసిందని, 70 శాతం ఒమైక్రాన్‌ కేసులు నమోదు అవుతున్నాయని హెల్త్‌ డైరెక్టర్‌ తెలియజేశారు. థర్డ్‌ వేవ్‌ ఎదుర్కోవాలంటే బూస్టర్‌ డోస్‌ తప్పనిసరి అని వైద్యనిపుణుల సూచన మేరకు కేంద్ర ప్రభుత్వం బూస్టర్‌ డోస్‌ ఇవ్వాలని ఆదేశించింది. ఈ మేరకు ఫ్రంట్‌లైన్‌ వర్కర్లకు, 60 సంవత్సరాల పైవారికి సోమవారం నుంచి బూస్టర్‌ డోస్‌ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని ఇప్పటికే జిల్లా అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.
రెండవ డోసు తీసుకొని తొమ్మిది నెలలు పూర్తయిన వారికి బూస్టర్‌ డోస్‌ ఇస్తారు. మొదటి, రెండు డోస్‌లు ఏ వ్యాక్సిన్‌ తీసుకుంటే అదే వ్యాక్సిన్‌ను బూస్టర్‌ డోస్‌ కింద ఇస్తారు. బూస్టర్‌ డోస్‌ను ముందుగా ప్రభుత్వ, పైవ్రేట్‌ ఆసుపత్రుల్లో పని చేస్తున్న వైద్యులు, సిబ్బంది, అంగన్‌వాడీ సిబ్బంది, పోలీస్‌, రెవెన్యూ, మున్సిపల్‌, పంచాయతీ రాజ్‌ శాఖ అధికారులు, సిబ్బందికి, 60 సంవత్సరాల పె వారికి, బీపీ, షుగర్‌ ఇతర జబ్బులతో బాధపడుతున్న వారికి ఇస్తారు. బూస్టర్‌ డోస్‌ తీసుకునేందుకు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ చేసుకోవచ్చు. లేదా తమ ఆధార్‌ కార్డు మొదటి, రెండు డోస్‌లు తీసుకున్న సమయంలో నమోదు చేయించిన మొబైల్‌ నంబర్‌తో నేరుగా వెళ్లి రిజిస్ట్రేషన్‌ చేసుకుని బూస్టర్‌ డోస్‌ తీసుకోవచ్చు.

Leave a Reply

Your email address will not be published.