Breaking News

ప్రజలను మభ్య పెడుతున్న కేంద్ర రాష్ట్రం ప్రభుత్వాలు

మహబూబాద్ జిల్లా మరిపెడ మున్సిపాలిటీ కేంద్రంలోని హాల్లో ఏర్పాటుచేసిన డోర్నకల్ నియోజకవర్గం సభ్యత్వ నమోదు కార్యక్రమం, విస్తృత స్థాయి సమావేశంలో ముఖ్యఅతిథిగా డాక్టర్ రామచంద్రనాయక్ పాల్గొని నియోజకవర్గంలోని ఆరు మండలాల్లో మండల అధ్యక్షులు, సభ్యత్వ బూత్ స్థాయి ఇంచార్జి లను సభ్యత్వ నమోదు గురించి అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అధినేత్రి, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, తెలంగాణ పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు నియోజకవర్గ వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టారు, ప్రమాదంలో చనిపోయిన వారికి 2లక్షల రూపాయలు భీమ వర్తిస్తుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు బండి శ్రీనివాస్ , వివిధ మండల అధ్యక్షులు బత్తుల శ్రీనివాస్ యాదవ్, అంబటి వీరభద్రం,రావుల రామ్ రెడ్డి, రఘువీరారెడ్డి,బట్టు నాయక్, జింకల రమేష్, బ్లాక్ అధ్యక్షులు కమలాకర్, రాజశేఖర్,ఎస్టి సెల్ అధ్యక్షుడు బానోతు రాము, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు గంట యకేష్ యాదవ్, రేకుల తండా ఇస్లావత్ సుధాకర్, డీజే శ్రీనివాస్,జర్పుల బంటి కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.