Breaking News

కేసీఆర్ ఆలోచనాత్మక శక్తి అద్భుతం

షాద్ నగర్ ఎమ్మెల్యే వై. అంజయ్యయాదవ్ 
 కొండన్నగూడలో రైతుబంధు సంబరాలు

తెలంగాణలో రైతు రాజ్యాన్ని స్థాపించి రైతునే రారాజుగా మార్చి, అన్నదాత కష్టసుఖాలలో అన్నీ తానై నిలిచిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనాత్మక శక్తి అద్భుతమని షాద్ నగర్ ఎమ్మెల్యే వై అంజయ్య యాదవ్ కొనియాడారు. రైతుబంధు సంబరాలను ప్రభుత్వం నిర్వహిస్తున్న సందర్భంగా రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం ఫరూక్ నగర్ మండలం కొండన్నగూడ గ్రామంలో బుధవారం ఘనంగా జరిగాయి. రైతులు ప్రజలు మహిళలు పెద్ద ఎత్తున సంబరాలలో పాల్గొని ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ మాట్లాడుతూ.. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణలో రైతులకు రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టి పంట పెట్టుబడులను ప్రభుత్వం ఇవ్వడం అనిర్వచనీయం అని అన్నారు. వ్యవసాయం విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనాత్మకమైన శక్తి మరెవరికి లేదని కొనియాడారు. రైతు పంట పెట్టుబడి మొదలుకొని రైతు కుటుంబ భద్రత కోసం భీమా సౌకర్యం కల్పించిన ఘనత కెసిఆర్ దని అన్నారు. 24 గంటల నిరంతర విద్యుత్ సౌకర్యంతో వ్యవసాయం ముందుకు కొనసాగుతుందని ఆనందం వ్యక్తం చేశారు. ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి సాధించలేని ఘనత కెసిఆర్ సాధించారని, రైతుల గుండెల్లో కెసిఆర్ చిరస్థాయిగా నిలిచారని అన్నారు. 50 వేల కోట్ల రూపాయలను రైతుబంధు  ఖాతాలో జమ చేయడం రైతుల పక్షపాతిగా కెసిఆర్ ను సూచిస్తుందని అన్నారు. తెలంగాణలో వ్యవసాయంతో పాటు అన్ని రంగాలను అభివృద్ధి చేస్తున్న కెసిఆర్ చల్లగా ఉండాలని ప్రజలు దీవిస్తున్నారని అన్నారు. రైతుబంధు సంబరాలు పాల్గొన్నందుకు ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మండల ఎంపీపీ ఇద్రిస్, జెడ్పిటిసి వెంకట్రామిరెడ్డి, రైతు కమిటీ నాయకులు తాండ్ర వెంకట్ రెడ్డి, గ్రామ సర్పంచ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.