Breaking News

అన్న సంతర్పణ ఓ యజ్ఞంలా సాగాలి

  • షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి
  • శివ మారుతి గీతా అయ్యప్ప మందిరంలో అయ్యప్ప భక్తులకు అన్న సంతర్పణ
అన్న సంతర్పణ ఓ యజ్ఞంలా సాగాలని షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే చౌలపల్లి ప్రతాప్ రెడ్డి అన్నారు. సోమవారం రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ శ్రీ శివ మారుతి గీతా అయ్యప్ప మందిరంలో అయ్యప్ప భక్తులకు అన్న సంతర్పణ చేశారు. ఈ సందర్భంగా ప్రతాప్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ..అన్ని దానాలన్నింటిలోకి అన్నదానం మిన్న అని, అన్నదానాన్ని మించిన దానం మరొకటి లేదని అన్నారు. ఎందుకంటే ఏది దానంగా ఇచ్చినా… ఎంత ఇచ్చినా కూడా ఇంకా ఇంకా కావాలనిపిస్తుందని, కాని అన్నదా నంలో మాత్రం దానం తీసుకున్నవారు ఇంక చాలు అని చెప్పి సంతృప్తిగా లేస్తారని వివరించారు. ఏ దానం ఇచ్చినా దానం తీసుకున్నవారిని మనం సంతృప్తిపరచలే కపోవచ్చు కాని అన్నదానం చేస్తే మాత్రం దానం తీసుకున్నవారిని పూర్తిగా సంతృప్తిపరచవచ్చని అన్నారు. అన్నదానాన్ని ఒక యజ్ఞంలా భావించి సంతర్పణ చేసేవారికి స్వామి ఆశీస్సులు ఉంటాయని అన్నారు. అన్నదానం చేయలేకయినా అన్నం పెట్టే ఇంటినన్నా చూపించమని పెద్దలు చెప్తారని ఈ సందర్భంగా వివరించారు. ఈ కార్యక్రమంలో షాద్ నగర్ మున్సిపల్ మాజీ చైర్మన్ అగ్గనూర్ విశ్వం, మాజీ ఎంపిటిసి కట్ట వెంకటేష్ గౌడ్, కో ఆప్షన్ సభ్యులు ఒగ్గు కిషోర్, యూత్ కాంగ్రెస్ రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి అందే మోహన్ స్వామి, యువ నాయకులు అప్పి మురళీమోహన్, సందీప్ గౌడ్, గణేష్ ,చెరుకు శివ, చౌలపల్లి వివేక్, విద్యార్థి నాయకులు జంగారి రవి, అయ్యప్ప స్వాములు గోలేపు చంద్రశేఖర్ స్వామి, రేటికల్ నందీశ్వర స్వామి, వెంకట్ రామ్ రెడ్డి, జైహింద్ రెడ్డి, ప్రవీణ్ గౌడ్, నక్కల మల్లేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published.