Breaking News

అయ్య‌ప్ప ఆల‌యంలో నృత్య స‌మ‌ర్ప‌ణం

శేరిలింగంపల్లి, సిటీటైమ్స్‌:  శేరిలింగంప‌ల్లిలోని అయ్య‌ప్ప స్వామి ఆల‌యంలో నృత్య స‌మ‌ర్ప‌ణం సంస్కృతి కార్య‌క్ర‌మం క‌న్నుల పండువ‌గా జ‌రిగింది. స్వామి స‌న్నిధిలో క‌ళాకారులు నృత్య ప్ర‌ద‌ర్శ‌న‌ను శ‌నివారం చేశారు. త‌మ నృత్యాన్ని కానుక‌గా స‌మ‌ర్పించారు. గురు సంతోష్ కుమార్ త‌మంగ్ ఆధ్వ‌ర్యంలో బేబి ఉర్జీవ త‌మంగ్ పుష్పాంజ‌లి, శ్లోకం, అల‌రిప్పు, స‌ర‌స్వ‌తి శ‌బ్దం నృత్య రూపంలో ప్ర‌ద‌ర్శించారు. నిఖిల్ దేవ్ హ‌నుమాన్ చాలీసా రూప‌కం చేశారు. సంతోష్ కుమార్ త‌మిళ ప‌థం కాలైతూకి, వ‌ర‌గ‌మ్లూ అయ్య‌, విష్ణు సంకీర్త నామాలు క‌ళారూపాల‌ను ప్ర‌ద‌ర్శించి భ‌క్తుల‌ను మంత్ర ముగ్ధుల‌ను చేశారు.

Leave a Reply

Your email address will not be published.